Home జాతీయ వార్తలు సిఎం పేరుపై టికెట్ బుక్ చేసి…

సిఎం పేరుపై టికెట్ బుక్ చేసి…

Ticket

 

బెంగళూరు: ఓ ప్రయాణికుడు సిఎం పేరు మీద బస్సు టికెట్ బుక్ చేసి అనంతరం దీపావళి గిఫ్ట్‌గా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాడు. రాజేశ్ సేత్ అనే ప్రయాణికుడు దీపావళి సందర్భంగా బెంగళూరు నుంచి తన సోంతూరు వెళ్లాలనుకున్నాడు.  బెంగళూరు నుంచి హోన్నార్ ప్రాంతానికి ఆర్‌టిసిలో అయితే కిరాయి రూ.420 నుంచి రూ.580 అవుతోంది. కానీ అదే ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్‌లో బుక్ చేస్తే టికెట్ ధర రూ.1520 వచ్చింది. ఆర్‌టిసితో పోలిస్తే మూడు రెట్లు రావడం అవాక్కయ్యాడు. దీంతో ఎఆర్‌ఎస్ ట్రావెల్స్‌లో ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేరు మీద టికెట్ బుక్ చేశాడు. పండుగ పూట ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టారీతిగా ధరలు పెంచుతుండడంతో ఆ టికెట్‌ను సిఎం పేరు మీద బుక్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాడు. ఇప్పటికైనా పండుగ పూట ప్రైవేట్ ట్రావెల్స్ దందాను అరికట్టాలని రాజేష్ కోరాడు. పండుగ సమయాల్లో ఇష్టారీతిగా టికెటు ధరలు పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  పెరిగిన టికెట్ ధరపై ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్ ఎండి రాజశేఖర్ స్పందించాడు. ప్రతి మూడు నెలలకొకసారి రూ.3885 రోడ్ ట్యాక్స్ చెల్లిస్తామని,  టోల్‌ప్లాజా ట్యాక్స్ కూడా తమపై అదనపు భారం పడుతోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్తే అక్కడ కూడా ట్యాక్స్ చెలించాల్సి వస్తుందని అవేదన వ్యక్తం చేశాడు.

 

Ticket Book on CM Yadyurappa Name by Passenger