Friday, June 9, 2023

గొర్రెల మందపై పులి దాడి?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పిట్లం: కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రాంపూర్ కలాన్ అటవీ ప్రాంతంలో గొర్రెల మందపై చిరుత పులి దాడి చేసింది. శుక్రవారం రాంపూర్ కలాన్ గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. గొర్రె మందలో నుంచి గొర్రెను లాక్కెళ్లి కొంచెం దూరంలో పులి తిన్న ఆనవాళ్లు కనిపించాయి. పులికి సంబంధించిన అడుగులను పరిశీలిస్తున్నామని ఎఫ్‌ఆర్‌వొ సంజయ్ గౌడ్, అటవీ శాఖాధికారులు సిద్దార్థ తెలిపారు. పులి భారీ నుంచి తమను, గొర్రెలను పశువులను కాపాడాలని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News