Home కుమ్రం భీం ఆసిఫాబాద్ పులి దాడిలో పశువులు హతం

పులి దాడిలో పశువులు హతం

Royal-Bengal-Tiger

బెజ్జూర్: కొమురంభీం జిల్లా బెజ్జుర్ మండల కేంద్రం లోని సలుగుపల్లి గ్రామానికి చెందిన తామెర బక్కయ్యకు చెందిన ఆవు, కోడె పులి దాడిలో హతమైనట్లు ఎఫ్‌ఆర్ రామోహన్‌రావు, ఎఫ్‌ఎస్‌ఒ వేణుగోపాల్ వెల్లడించా రు. బాధితుడు తామెర బక్కయ్య వివరాల ప్రకారం.. తన ఆవు, కోడె మూడు రోజులుగా ఇంటికి రాకపోవడంతో తాను చుట్టుపక్క ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరకలేదన్నారు. దగ్గరలో ఉన్న సిద్దప్ప గుట్ట గల అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా మొదటిరోజు ఆవు మృతి చెంది కనిపించిందని, రెండో రోజు గాలించగా కోడె కూడా మృతి చెంది కనిపించిందని కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామస్థులు ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించగా, వారు అక్కడకు చేరుకొని పరిశీలించారు. బాధితుడికి 10 రోజుల్లో నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.