Home తాజా వార్తలు టేకుపల్లిలో పులి అలజడి

టేకుపల్లిలో పులి అలజడి

Tiger spotted at tekulapally

 

టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని అటవీ ప్రాంతంలోకి పెద్దపులి రెండురోజుల క్రిందట ప్రవేశించింది. దీంతో మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జంగాలపల్లి దగ్గర శనివారం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన పులి ఆదివారం టేకులపల్లి గ్రామ సమీపంలోని వరి పొలాలలో పరిగెత్తుతూ కనిపించింది. దీనిని బోడు గ్రామం నుంచి ఆ మార్గంలో వస్తున్న వారు గమనించి కారు ఆపి సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. కాగా పెద్దపులి సమాచారంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని వ్యవసాయ పనులకు వెళ్ళే వారు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పెద్దపులి కుంటాల గ్రామం నుంచి మద్ధిరాల తండ వైపు వెళ్ళినట్లు గ్రామస్ధులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

Tiger spotted at tekulapally