Saturday, April 20, 2024

అర్ధరాత్రి వేళ దర్జాగా.. పెద్ద పులి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ జంగిల్ @ అమ్రాబాద్ టైగర్

మనతెలంగాణ/ హైదరాబాద్ : అమ్రాబాద్ అడవుల్లో విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులకు పెద్దపులి కంటపడింది. అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ పులిని.. విధి నిర్వహణలో భాగంగా రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తుండగా నాగర్ కర్నూల్ జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్‌రెడ్డికి కనబడింది. దీనిని ఆయన తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఆ వీడియోను వేల సంఖ్యలో వీక్షించారు. డిఎఫ్‌ఓ రోహిత్ రెడ్డితోపాటు అమ్రాబాద్ అటవీ సిబ్బంది ని పలువురు ట్విట్టర్ వేదికగా అభినందించారు.

పెద్దపులి కంటపడటం మామూలు విషయం కాదు. ఒకవేళ కంటపడినా.. అది వెంటనే పరుగెత్తి వెళ్లడం సహజం. కానీ.. అర్ధరాత్రి వేళ వాహనం లైట్లు పడుతున్నప్పటికీ నిమిషానికి పైగా దర్జాగా నడుచుకుంటూ పులి వెళ్లిన వైనం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పులుల సంరక్షణ, అటవీ జంతువుల సంరక్షణ కు తీసుకున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వంను,ఆటవీ శాఖ సిబ్బందిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. పులిని చూడటం అదృష్టమని కొందరు అభిప్రాయపడుతుండగా.. పులిని చూశాక వాహనం లైట్లు ఎందుకు ఆర్పలేదని మరికొంతమంది నెటిజన్లు ప్రశ్నించారు. ట్విటర్‌లో జంగిల్స్ ఆఫ్ తెలంగాణ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను డిఎఫ్‌ఓ ప్రస్తావించారు. నిమిషం పది సెకన్ల వీడియోను ఆయన జతపరిచారు. అందులో ఓ పెద్ద పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News