Home తాజా వార్తలు వామ్మో..! పులి..! ఎప్పుడు పట్టుకుంటారో మరీ..!

వామ్మో..! పులి..! ఎప్పుడు పట్టుకుంటారో మరీ..!

Tiger wandering at nizamabad district

 

మన తెలంగాణ/బీర్కూర్: పులి ఎప్పుడు ఏం చేస్తుందోనని.. దర్జాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో సంచరిస్తుండటంతో ప్రజలంతా భయం.. భయంగా గడుపుతున్నారు. అదిగో పులి.. అక్కడ కనిపించింది. ఇక్కడ కనిపించిందని తెలియగానే జంకుతున్నారు. చాలా మంది రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మందికి పులి కంట పడగా, సుమారు 20 రోజుల నుంచి ఉమ్మడి మండలాల్లో పులి సంచరిస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇదిలా ఉండగా, ఏకంగా రాత్రివేళల్లో గ్రామాల్లో సంచరిస్తుందని, పలు సిసి కెమెరాల పుటెజీల్లో రికార్డు కావడంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పులిని, వాటి పిల్లలను పట్టుకోవాలని కోరుతున్నారు. పులి కోసం బోన్లు ఏర్పాటు చేశామని అటవీ శాఖాధికారులు పేర్కొంటున్నారు.

Tiger wandering at nizamabad district