Home జయశంకర్ భూపాలపల్లి ములుగులో పెద్దపులి కలకలం

ములుగులో పెద్దపులి కలకలం

Tiger wandering in mulugu district

 

ములుగు: మండలంలో రాయిని గూడెం శివారులో దేవుగుట్ట అటవీ ప్రాంతంలో పెద్ద పులి అడుగులను సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, నర్సంపేట పాకాల సమీప అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి ఇటుగా వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని సూచించారు.