Home తాజా వార్తలు టిక్ టాక్ సింగర్ రాజు బలవన్మరణం

టిక్ టాక్ సింగర్ రాజు బలవన్మరణం

Tik Tok Singer Raju Commits Suicideసిద్దిపేట : టిక్ ‌టాక్‌ పాటలతో గుర్తింపు పొందిన గడ్డం రాజు ఆదివారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోడూరు మండలం గంగాపూర్ కు చెందిన రాజు  ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే ఇక లేడని ఇక రాడాని చెప్పమ్మ’ అనే పాటతో సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు పొందాడు. రాజుకు సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజు రాఖీ పండుగకు ఒక్కరోజు ముందే ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాదం  అలుముకుంది. రాజు ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం రాజు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.