బీజింగ్ : చైనీస్ షార్ట్-వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ 2020లో 540 మిలియన్ డాలర్ల లాభంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైన యాప్ గా నిలిచింది. భారతదేశంలో నిషేధించబడినా, యునైటెడ్ స్టేట్స్లో న్యాయ పోరాటం ఎదుర్కొంటున్నప్పటికీ సుమారు 400 కోట్ల లాభాన్ని ఆర్జించింది. యూత్ ఎక్కువగా మాట్లాడే డేటింగ్ యాప్ టిండర్ 513 మిలియన్ల డాలర్ల లాభం పొంది రెండవ అత్యంత లాభదాయక యాప్ గా నిలిచింది. యాప్ అనలిటిక్స్ సంస్థ అప్టోపియా విడుదల చేసిన డేటా ప్రకారం 478 మిలియన్ డాలర్ల లాభంతో యూట్యూబ్ మూడవ అత్యంత లాభదాయక యాప్ గా, తరువాత డిస్నీ 314 మిలియన్ డాలర్ల లాభంతో, టెన్సెంట్ వీడియో 300 మిలియన్ డాలర్ల లాభంతో తర్వాత స్థానాలలో నిలిచాయి. నెట్‌ఫ్లిక్స్ యాప్ 209 మిలియన్ల డాలర్ల లాభంతో 10వ స్థానంలో ఉంది.