Thursday, April 25, 2024

టిక్‌టాక్‌లో పాపులారిటీ ఆమె ప్రాణం తీసింది…..

- Advertisement -
- Advertisement -

Tiktok star dead in salon at haryana

 

ఛండీగఢ్: టిక్‌టాక్‌లో పాపులారిటీ రావడంతో టిక్‌టాక్ స్టార్‌ను హత్య చేసిన సంఘటన హర్యానాలోని సోనిపాట్ ప్రాంతం కుండ్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బ్యూటీషియన్ శివాని(20) తన సోదరి, నీరజ్‌తో కలిసి బ్యూటీ పార్లర్ నడిపిస్తోంది. శివాని టిక్‌టాక్ వీడియోలు చేయడంతో ఆమెకు లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆరిఫ్ మహ్మాద్ అనే వ్యక్తి శివాని కుటుంబ సభ్యులతో చనువుగా ఉంటూ టిక్‌టాక్‌లో వచ్చిన పాపులారిటీని చూసి ఆమెపై అసూయ పెంచుకున్నాడు. శుక్రవారం సాయంత్రం శివాని ఒంటరిగా ఉన్నప్పుడు ఆరిఫ్ బ్యూటీ పార్లర్‌లోకి చొరబడి శివాని గొంతుకు దుప్పెట చుట్టి హత్య చేశాడు. బెడ్ కింద మృతదేహాన్ని దాచిపెట్టి అనంతరం అక్కడి నుంచి జారుకున్నాడు. మరునాడు బ్యూటీ పార్లర్ లో ఓ గది నుంచి వాసన రావడంతో బెడ్ కింద మృతదేహం కనిపించడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్‌పి వీరేందర్ సింగ్ తెలిపాడు. ఆరిఫ్‌పై అనుమానాలు ఉన్నాయని శివాని కుటుంబ సభ్యులు తెలపడంతో అతడిని కస్టడీలోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News