Friday, April 26, 2024

బిల్ట్‌లో కలప దొంగలు…….!

- Advertisement -
- Advertisement -

భారీ టేకు వృక్షాలను నరికి తరలిస్తున్న వైనం
అటవీశాఖ అధికారులు, బిల్ట్ కార్మికుల హస్తం ఉందంటున్న గ్రామస్థులు
ఇప్పటికే నాలుగు సార్లు కలప దొంగతనాలు
కర్మాగారంలోను ఇదే తంతు
పట్టించుకోని అటవీశాఖ అధికారులు

Timber thieves in Mangampet

మనతెలంగాణ/మంగపేట: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలోని బిల్ట్ కాలనీలోని టేకు, జిట్రేగి కలపలను కొంత మంది దుండగులు రాత్రి వేళల్లో రంపంతో కోసి ముక్కలుగా చేసి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో బాగంగానే బిల్ట్ కాలనీలో హెచ్‌టైప్ క్వాటర్ ఎదురుగా ఉన్న భారీ టేకు వృక్షాన్ని ఆదివారం రాత్రి రంపంతో కోసి వేసి ముక్కలుగా తయారు చేసుకుని తరలించారు.

మరో దుంగ మిగిలి ఉండగా స్థానిక కాలనీవాసులు చూడడంతో దొంగలు వదిలివేశారు. గతంలో సుమారు నాలుగు సార్లు కాలనీలోని టేకు, జిట్రేగి కలపలను అక్రమంగా తరలించిన సంగతి తెలిసిందే ఇంత జరుగుతున్నా స్థానిక అటవీశాఖ అధికారులు కలప స్మగ్లింగ్‌పై దృష్టి సారించడం లేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్న అయితే బిల్ట్ కాలనీతో పాటుగా కర్మాగారం గోడను పగుల గొట్టి కర్మాగారంలో ఉన్న అతి విలువైన టేకు చెట్లను నరికి వేసి తరలిస్తున్నట్టు సమాచారం అయితే గత ఆదివారం రాత్రి జరిగిన కలప స్మగ్లింగ్‌లో బిల్ట్ కాలనీలోని కొంత మంది కార్మికులు, జేఏసీ నాయకులలో కొంత మంది, స్థానిక కార్పెంటర్, మరో అటవీశాఖ అధికారి కుమ్మక్కై కలపను తరలించుకు పోతున్నట్టు చర్చ జరుగుతుంది.

ఈ విషయంపై స్థానిక రేంజ్ ఆఫీసర్ షకిల్ పాషాను వివరణ కోరగా ఆ విషయం నాకు తెలియదని ఇప్పుడే మా బేస్ క్యాంప్ సిబ్బందిని అక్కడికి పంపుతానని తెలిపారు. అటవీశాఖ అధికారుల హస్తం ఉన్నదని తెలిసిందని అడుగగా విచారణ చేసి అటువంటి వారు ఉంటే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదిలా ఉంటే టేకు చెట్లను దొంగిలించే దొంగలు కాలనీలోని మరి కొన్ని చెట్ల మొదళ్ళను చుట్టూ ఉన్న గాట్లు పెట్టి చెట్లు ఎండిపోయిన అనంతరం వాటని నరికి తీసుకు వెళుతున్నట్టు కాలనీ మహిళలు తెలపడం విశేషం. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి కనుమరుగు అవుతున్న టేకు, జిట్రేగి చెట్లను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News