Home తాజా వార్తలు డైట్ సరికొత్తగా..

డైట్ సరికొత్తగా..

Tips for Dieting

 

శరీరంలోని కొవ్వును పూర్తిగా తగ్గించుకోవాలంటే మనం తినే ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలని పాలియో డైట్ చెబుతుంది. అంటే ఆహారంలో ఎక్కువుగా మాంసం, చేపలు, గుడ్లు, తీపి పదార్థాలు వంటివి ఉండాలని, అవి తిన్న తరువాత వ్యాయామం చేయాలని అప్పుడే శరీరంలో ఉండే కొవ్వు పూర్తిగా నిరోధించ వచ్చన్నది పాలియో డైట్ సిద్ధాంతం. అలాగే తీసుకునే ఆహారంలో పాలు, పెరుగు లేకుండా ఉండాలన్నది వీగన్ డైట్ సిద్ధాంతం. పాలు, పెరుగుతో శరీరానికి అందే కాల్షియం కొరకు సున్నుండలు లాంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలని వీగన్ డైట్ చెబుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వ్యక్తులకు ఈ రెండు డైట్‌లు పాటించడం వల్ల ప్రమాదం ఉందని తెలుపుతూ వాటి స్థానంలో ఇప్పుడు కాలంలో అందుబాటులోకి వచ్చిందే పేగన్ డైట్.

పేగన్ డైట్ అంటే ఏంటి?
రోజు మొత్తంలో మనం తినే ఆహారంలో ముప్పావు వంతు పచ్చి కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు మిగిలిన పావు వంతులో నాటు కోడి, నాటు కోడి గుడ్లు, సముద్ర చేపలు, బాదం, ఆక్రోట్, పిస్తా తదితర పప్పులు ఉంటాయి. అలాగే రోజులో 150గ్రాములకు మించకుండా పప్పు ధాన్యాలు, 75 గ్రాములకు మించకుండా ఉండేలా చూసుకుంటారు.

మేక, గొర్రె పాలను, వాటి నుంచి వచ్చే నెయ్యి, బట్టర్ లాంటివి తీసుకోవచ్చు. ఇది పేగన్ డైట్ ఆహార నియామవళి. ఈ డైట్‌లో ఆవు పాలు, దాని ద్వారా వచ్చే నెయ్యి, బ ట్టర్, మజ్జిగ లాంటివి, గేద పాలు, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఈ డైట్‌లో పూర్తిగా నిషేధం. అలాగే పంచదార, బెల్లం, తేనె, గోధుమలతో చేసిన ఆహారం, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలు కూడా పూర్తిగా నిషేధించాలి.

నియంత్రణలో గ్లూకోజ్
పేగన్ డైట్ పాటిస్తే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. ఉడక బెట్టకుండా కాయగూరలను తీసుకోవడం వల్ల నేరుగా శరీరంలోకి కార్బోహైడ్రేట్స్ అందుతాయి కాబట్టి యాంటీఆక్సిడెంట్లు లభించి హార్ట్ బీట్ నియంత్రణలో ఉంటుంది. అలాగే మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రొటీన్లు అందుతాయి. ఈ ప్రొటీన్లు శరీరంలో కొవ్వును నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు శక్తిగా మార్చడానికి ఉప యోగపడతాయి.

ఎక్కువుగా అధిక బరువు, ఊ బకాయం ఉన్నవారు వ్యాయామం చేయడానికి సమయంలేని వారు ఈ డైట్ పాటిస్తే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఒక మనిషి ఎంత బరువు ఉంటాడో అంతేస్థాయిలో అన్ని గ్రాముల ప్రొటీ న్లు శరీరానికి అవసరమవుతాయి. అదే వ్యాయామం లాంటివి చేస్తే మరికొంత అదనంగా ప్రొటీన్లు అవస రం ఉంటుంది. వ్యాయామం చేయలేని వారు ప్రొటీన్లు కోసం పేగన్ డైట్ పాటిస్తే మంచిది.