Home జాతీయ వార్తలు సూర్యగ్రహణం సందర్భంగా డిసెంబర్ 26న తిరుమల ఆలయం మూసివేత

సూర్యగ్రహణం సందర్భంగా డిసెంబర్ 26న తిరుమల ఆలయం మూసివేత

 

తిరుమల: సంపూర్ణ సూర్య గ్రహణాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 26వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు 13 గంటలు మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. డిసెంబర్ 26వ తేదీ ఉదయం 8.03 గంటల నుంచి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని, ఆలయ సాంప్రదాయాల ప్రకారం డిసెంబర్ 25వ తేదీ రాత్రి 11 గంటల నుంచి డిసెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ తలుపులను మూసివేయనున్నట్లు టిటిడి తెలిపింది. సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాల అనంతరం మధ్యాహం 2 గంటల నుంచి భక్తులకు దర్శన ప్రవేశం కల్పిస్తామని తెలిపింది.

 
Tirumala temple to be closed on Dec 26, Due to total Solar eclipse Srivari temple in Tirumala will be closed for devotees