Home ఆంధ్రప్రదేశ్ వార్తలు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని చూస్తున్నారు…

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని చూస్తున్నారు…

Chinta Mohanతిరుపతి : హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం ప్రణాళికలు తయారు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనున్నారన్న సమాచారం తన వద్ద ఉందని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై కేంద్రం అధికార, రాజకీయ ప్రముఖులతో చర్చిస్తుందని ఆయన తెలిపారు. తిరుపతి ఎపి రాజధాని కావడం ఖాయమన్న చింతామోహన్, ఎపి సిఎం జగన్ అమరావతిని వదిలి తిరపతికి రావాలని ఆయన చెప్పారు. ఎపి రాజధానిగా తిరుపతి అన్ని విధాల అనువైనదని ఆయన స్పష్టంచేశారు.

Tirupathi Ex MP Chinta Mohan Comments On Hyderabad