Home తాజా వార్తలు కృత్రిమమేధపై ఇంటర్న్‌షిప్ శిక్షణ

కృత్రిమమేధపై ఇంటర్న్‌షిప్ శిక్షణ

TITA AI Internship program to begin from july 12

 

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా నూతన విధానంలో కోర్సు
నామమాత్రపు ఫీజుతో శిక్షణ అందిస్తున్న టీటా డిజిథాన్
కోర్సు పూర్తైన వారికి అమెరికా టాప్ 50 యూనివర్సిటీలలో ఒకటైన యూటిడిచే సర్టిఫికెట్
ఇప్పటికే శిక్షణ పూర్తైన వారిలో 80 శాతం మందికి పైగా ప్లేస్‌మెంట్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ పేరుతో ప్రత్యేకంగా ఒక ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే, ఈ నూతన టెక్నాలజీ రంగంలో శిక్షణ కావాలంటే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ రంగంలోని అవకాశాలు కైవసం చేసుకునేందుకు ఇంటర్న్‌షిప్ కల్పిస్తూ రూపొందించిన శిక్షణను ఈనెల 12 నుంచి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) డిజిథాన్ అందిస్తోంది. ఈ కోర్సు ఉత్తీర్ణులైన వారు అమెరికాలోని టాప్ 50 యూనివర్సిటీలలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ (యూటీడీ)ద్వారా శిక్షణ పత్రం పొందనున్నారు.

ఈ శిక్షణకు 50,000కు పైగా దరఖాస్తులు రాగా, ఇయర్ ఆఫ్ ఏఐ ద్వారా దాదాపు రెండు వేల మందికి శిక్షణ అందించగా యూటిడి నిర్వహించిన పరీక్షల్లో 96.7 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు అయింది. ఇందులో 80 శాతానికి పైగా అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ పొందగలిగారు. ఈ శిక్షణ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు జులై 10వ తేదీ తుది గడువు కాగా, 8 వారాల ఈ శిక్షణలో ఉత్తీర్ణులైన వారికి అమెరికాలోని టాప్ 50 యూనివర్సిటీలలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ ద్వారా శిక్షణ పత్రం పొందనున్నారు. సామాజిక ప్రయోజనాల కోసం టీటా- డిజిథాన్ ద్వారా కేవలం రూ.10,000లకే ఈ శిక్షణ అందించనున్నారు. bit.ly/ digith on_academy లింక్ దరఖాస్తు చేసుకోవచ్చు. సమాచారం కోసం 6300368705/ 81231 23434/8712360354 లలో సంప్రదించవచ్చు.

TITA AI internship programme to start from july 12