Thursday, March 28, 2024

ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో టీటా శిక్షణ

- Advertisement -
- Advertisement -

TITA training in field of Artificial Intelligence

దరఖాస్తులకు అక్టోబర్ 29వ తేదీ తుదిగడువు
నవంబర్ 01వ తేదీ శిక్షణ ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్ : యువత ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అవకాశాలు కైవసం చేసుకునేందుకు ఇంటర్న్ షిప్ కల్పిస్తూ రూపొందించిన శిక్షణను నవంబర్ 1 నుంచి అందిస్తున్నట్టు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) డిజిథాన్ పేర్కొంది. ఈ కోర్సు ఉత్తీర్ణులైన వారు అమెరికాలోని టాప్ 50 యూనివర్సిటీలలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ (యూటీడీ) ద్వారా శిక్షణ పత్రం పొందనున్నారు. గతంలో ఇంటర్న్ షిప్ సహిత శిక్షణను టీటా డిజిథాన్ నిర్వహించింది. ఈ శిక్షణకు 50,000కు పైగా దరఖాస్తులు రాగా , ఇయర్ ఆఫ్ ఏఐ ద్వారా దాదాపు రెండు వేల మందికి శిక్షణ అందించగా యూటిడి నిర్వహించిన ఎగ్జామ్లో 96.7 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు అయింది. ఇందులో 80శాతంకు పైగా అభ్యర్థులు ప్లేస్‌మెంట్స్ పొందగలిగారు.ఈ శిక్షణకు కొనసాగింపుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై 2021 శిక్షణ అందించనున్నట్లు టీటా డిజిథాన్ ప్రకటించింది.

8 వారాల ‘ఈ’ శిక్షణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆండ్ మెషిన్ లెర్నింగ్ ఇన్‌ప్లాంట్ ట్రైనింగ్ ఆండ్ ఇంటర్న్ షిప్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అందించనున్న శిక్షణ ఈ నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా 8 వారాల ఈ శిక్షణ ఉంటుంది. దరఖాస్తులకు అక్టోబర్ 29వ తేదీ తుదిగడువుగా టీటా పేర్కొంది. ఈ శిక్షణలో ఫేషియల్ రికగ్నిషన్, చాట్ బాట్ ప్రాజెక్టులు చేయనున్నారు. 2020 బ్యాచ్‌లో ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా అటెండెన్స్ మేనేజ్‌మ్మెంట్ ప్రాజెక్ట్ చేపట్టారు. కోవిడ్ సమయంలో ఏఐ ద్వారా అప్లికేషన్ రూపొందించి మాస్క్ ధరించారా అనేది గుర్తించారు. ఇలాంటి అంశాలతో పాటుగా ప్రస్తుత శిక్షణలో మెషిన్ లెర్నింగ్ , డీప్ లెర్నింగ్ అంశాల వరకు ఈ శిక్షణ ఉండనుందని టీటా తెలిపింది. మరింత సమాచారం కోసం 6300368705/ 8123123434/8712360354 లలో సంప్రదింవచ్చని టీటా నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News