Thursday, March 28, 2024

బెంగాల్‌లో టిఎంసి యువ నేత హత్య

- Advertisement -
- Advertisement -

TMC youth leader assassinated in Bengal

ఐదుగురు వ్యక్తులు అరెస్టు

బారక్‌పూర్(బెంగాల్): పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో అధికార టిఎంసికు చెందిన ఒక యువ నాయకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు శనివారం తెల్లవారుజామున కాల్చి చంపారు. ఈ హత్యకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య వెనుక బిజెపి హస్తం ఉందని టిఎంసి ఆరోపించగా టిఎంసిలో అంతర్గత కలహాలే ఈ హత్యకు కారణమని బిజెపి చెబుతోంది. ఖర్దా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది కరోనా వైరస్ కారణంతో మరణించిన కాజల్ సిన్హా సన్నిహిత అనుచరుడైన రనజోయ్ కుమార్ శ్రీవాస్తవ(33)ను ఖర్దా పోలీసు స్టేషన్ పరిధిలోని తీతాగఢ్ వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కారులో వస్తున్న శ్రీవాస్తవను అడ్డగించిన కారుపై బాంబులు విసిరి రివాల్వర్‌తో కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News