Friday, March 29, 2024

నీట్ నకిలీ అభ్యర్థుల గుట్టు విప్పండి…

- Advertisement -
- Advertisement -

NEET-scam

చెన్నై: తమిళనాడులో గత ఏడాది నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షలో అసలు అభ్యర్థులకు బదులుగా పరీక్ష రాసిన ఇద్దరు మహిళలతో సహా 10 మంది నకిలీ అభ్యర్థుల ఫోటోలను తమిళనాడు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన సిఐడి విభాగం మంగళవారం బహిర్గతం చేసింది. ఈ ఫోటోలలోని వ్యక్తులను గుర్తించి వారి సమాచారాన్ని తమకు అందచేయాలని సిబిసిఐడి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ పదిమంది నకిలీలలో ఇద్దరు మహిళలు ఉండడం విశేషం. నీట్ నకిలీ అభ్యర్థుల కుంభకోణం గత ఏడాది సెప్టెంబర్‌లో తమిళనాడులో వెలుగుచూసింది. తేని మెడికల్ కాలేజ్‌కి చెందిన ఎంబిబిఎస్ విద్యార్థి కెవి ఉదిత్ సూర్య అసలు రూపానికి నీట్ కార్డులో ఉన్న అతని ఫోటోకు పోలిక లేకపోవడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.

రెండుసార్లు నీట్ పరీక్షలో ఫెయిలైన సూర్య నకిలీ చేత నీట్ పరీక్షను ముంబైలో రాయించి గత ఏడాది ఉత్తీర్ణుడైనట్లు బయటపడింది. సూర్య, అతని తండ్రి స్టాన్టీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు వెంకటేశన్ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారిని తిరుపతిలో పోలీసులు అరెస్టు చేశారు. ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సూర్యకు బదులుగా నకిలీ అభ్యర్థితో నీట్ పరీక్ష రాయించిన కేరళకు చెందిన ఒక దళారీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తేనిలో బయటపడిన ఈ కుంభకోణంలో ఇంకా చాలామంది పాత్ర ఉన్నట్లు బయటపడడంతో పెద్దసంఖ్యలో అరెస్టులు జరిగాయి. ఇప్పటివరకు మొత్తం 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ అభ్యర్థి చేత పరీక్ష రాయించడానికి రూ.20 లక్షలకు పైగా దళారీకి చెల్లించినట్లు వెలుగుచూసింది.

TN CBCID releases NEET proxies photos, NEET scam in TN came to light in September last year

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News