Home జాతీయ వార్తలు చెన్నై సహా నాలుగు జిల్లాల్లో 19 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

చెన్నై సహా నాలుగు జిల్లాల్లో 19 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

TN Govt announces complete lockdown in 4 districts

 

కొవిడ్ ఉధృతితో తమిళనాడు సిఎం పళనిస్వామి నిర్ణయం
వైరస్ కట్టడికి 1930 వరకూ అమలు

చెన్నై : కోవిడ్ సంక్షోభ తీవ్రతతో తమిళనాడులో ఈ నెల 19వ తేదీ నుంచి భారీ ఆంక్షల లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ లాక్‌డౌన్ నెలాఖరు వరకూ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పడి కె పళనిస్వామి సోమవారం ప్రకటించారు. చెన్నైతో పాటు కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో 19 నుంచి 30వ తేదీ వరకూ తీవ్రస్థాయి ఆంక్షలు అమలులోకి వస్తాయని వివరించారు. అంతకు ముందు నిపుణులు, సీనియర్ అధికారుల సమన్విత సలహా సంప్రదింపుల కమిటీ కరోనా తీవ్రతను సమీక్షించింది. ఈ సందర్భంగా వ్యక్తం అయిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పళనిస్వామి తెలిపారు. కట్టుదిట్టమైన ఆంక్షలతో వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సి ఉందన్నారు. కోవిడ్‌పై రాష్ట్ర ప్రభుత్వం 19 మంది సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ సభ్యులు, అంటువ్యాధుల సీనియర్ వైద్యులు డాక్టర్ పి కుగనందం పరిస్థితిని తెలియచేశారు. ప్రస్తుత వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆంక్షల సడలింపులను వెంటనే ఎత్తివేయాలని, అప్పుడే వైరస్ కట్టడికి వీలవుతుందని తాము ప్రభుత్వానికి సూచించామని వెల్లడించారు. నిర్ణయం ప్రభుత్వానికి వదిలివేశామన్నారు. కొంతకాలంగా తమిళనాడులో కరోనా కేసులుపెరుగుతున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా యత్నిస్తోంది. సోమవారం నాటికి రాష్ట్రంలో కోవిడ్ రోగుల సంఖ్య 44,661కి చేరింది. ఇందులో చెన్నై మహానగరంలోనే 70 శాతం కేసులు నమోదు అయ్యాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్లనే నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని ఇటీవలే సిఎం చెప్పారు.

TN Govt announces complete lockdown in 4 districts