Sunday, March 26, 2023

ప్రజలకు జాబుదారులుగా ఉండాలి

- Advertisement -

hall

*ప్రజాప్రతినిధులకు కొప్పుల దిశ నిర్దేశం

మనతెలంగాణ/ధర్మారం:ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారులు గా ఉండి పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ సూచించారు. ధర్మారం మండలం ఖిలావనపర్తి లక్ష్మినర్సింహాస్వామి ఆలయ అవరణలో ఆదివారం నాడు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు,ముఖ్య ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశ ని ర్దేశం చేశారు. ఎన్నికల అనంతరం తొలిసారి జరిగిన ఈ సమావేశంలో ఈశ్వర్ వాడివేడిగా సుతి మెత్తగా ప్రజాప్రతినిధులకు ప్రజా సంబంధాల పై వివరించారు. ప్రధానంగా పార్టీ బాగుంటనే నేతలు, ప్రజాప్రతినిధుఏలు బాగుంటారని పార్టీ నిర్మాణం, గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. సిఎం కెసిఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగ గ్రా మ స్థాయిలో టిఆర్‌ఎస్ పటిష్టతకు కృషి చేయాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పరిపూర్ణ ప్రజా సేవలో ఉండాలని, గ్రామాల అభివృద్ధ్దిలో కీ లక భూమిక పోషించాలని ఈశ్వర్ చెప్పారు. సమస్యల పరిష్కారం కో సం ఆలోచన చేసి మార్గాన్ని వెదకాలని, ప్రజాప్రతినిధులు,నాయకులు ప్రజల నుంచి వస్తారని వారిని దూరం చేసుకుంటే భవిష్యత్ శూన్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ జవాబుదారి తనాన్ని అలవర్చుకొని ప్రజలతో మ ంచి సంబంధాలు కొనసాగిస్తే అవకాశాలు వాటింతట అవే వస్తామని ఈ శ్వర్ స్పష్టం చేశారు. దిశ నిర్దేశ కార్యక్రమంలో ఎంపిపి పాక మల్లేశ్వరి వేంకటేశం, మార్కెట్ చైర్మన్ కొత్త నర్సింహులు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పెంచాల రాజేశం, మేడారం విండో చైర్మన్ పూస్కూరి నర్సింగరా వు, టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు గుర్రం మోహన్ రెడ్డి, మండల కో-అప్షన్ సభ్యులు సలామొద్దీన్, ఎంపిటిసిలు వెల్పుల రేవతి నాగరాజు, తాళ్ళపల్లి లింగయ్యగౌడ్, పాకాల రాజయ్య గౌడ్, మూల మంగ మల్లేశం గౌడ్, నా యకులు పి. జితేందర్‌రావు, ఎండి హఫీజ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News