*నీటి విడుదలలో నిర్లక్షం
వహించొద్దు
*అధికారులను
హెచ్చరించిన మంత్రి
పోచారం శ్రీనివాస్‌రెడ్డి
మనతెలంగాణ/బోధన్: చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే విష యంలో అధికారులు నిర్లక్షం వహించకూడదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బోధన్ మండలంలోని సాలురా క్యాంపు పెంటకుర్దూ గ్రామ శివారులోని డి 28 నిజాంసాగర్ కాలువను మంత్రి ఆదివారం పరిశీలించారు. చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరందిస్తామని ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది అధికారుల నిర్లక్షం మూలంగా చివరి ఆయకట్టుకు రైతు లకు సక్రమంగా నీరు అందలేదని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రైతులకు నీరందించే విషయంలో కాలువలను పరిశీలించి నీరందించేం దుకు కృషి చేస్తానన్నారు. గట్టుగట్టుకైనా తిరిగి రైతు భూమిని తడిపించి రైతులను ఆదుకుంటామన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న 2 లక్షల 10 వేల ఎకరాల భూమిని బతికించేందుకు అధికా రులు కృషి చేయాలని ఆయన సూచించారు. రైతుల శ్రేయ స్సు కోసం ప్రభుత్వం త్వరలో ఎకరానికి రూ. 4వేల చొప్పున ఖాతాలో జమ చేయనుందని ఆయన పేర్కొన్నారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేపడుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులు అక్కసు ఒలకబోసుకుంటుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి ఉన్నప్పటికీ రైతులకు విద్యుత్ సరఫరా విషయంలో కంటిమీద కు నుకు లేకుండా చేసి ఇష్టారాజ్యంగా విద్యుత్ సరఫరా చేయడంతో అనేక మంది రైతుల పంటలు ఎండిపోయి అప్పులబాధతో ఆత్మహత్యలు చేసు కున్న సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు.
ప్రస్తుతం రైతులకు కష్టపెట్టకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేయ డంతో పాటు చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు కృషి చేస్తున్నా మని ప్రభుత్వం చేపడుతున్న పనులను చూసి కాంగ్రెస్ నాయకులు అతిగా మాట్లాడుతున్నారన్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లోని ఏ ఒక్క రైతు గుంట భూమిని ఎండకుండ చేస్తామన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ శాఖ డిఇ శ్రావణ్ కుమార్‌రెడ్డి, రైతు సమన్వయ కన్వీనర్ రాజేశ్వర్, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.