Tuesday, March 21, 2023

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

- Advertisement -

man

*జిల్లాలో పరీక్ష కేంద్రాలు మొత్తం కేంద్రాలు 46
*మొదటి సంవత్సరానికి 13098, 2వ సంవత్సరానికి 17991
*సెల్‌ఫోన్, జిరాక్స్ మిషన్‌లు పరీక్షాప్రాంతాల్లో నిషేధం
*అర్థగంట ముందు పరీక్ష హాల్‌లోకి అనుమతి
*ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి కిషన్

మన తెలంగాణ/సంగారెడ్డి : ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈ నెల 28న ప్రా రంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని కేంద్రాలలో ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి గానూ 13098 మంది విద్యార్థులు, ఒకేషనల్ మొదటి సంవత్సరం 865 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 893 మంది విద్యార్థులు,  ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరానికి గానూ 17991 మంది విద్యార్థులు, ఒకేషనల్ 893 మంది విద్యార్థులు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు హాజరవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులందరు 8.30 నుండి 8.45 గంటల వరకు ఆయా పరీక్షా కేంద్రాలలోకి అనుమతించడం జరుగుతుందని, అందుకు విద్యార్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నా రు. 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితులల్లో పరీక్షా కేంద్రాలలోకి అనుమతించేది లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలుండగా, 46 మంది సీఎస్‌లు, 46 మంది డీవోలతో పాటు, ప్రతి పరీక్షా కేంద్రాలలో ఒక ఎఎన్‌ఎమ్ నియమించడం జరిగిందన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరుగుతుందన్నారు. ఒక కి.మీల వరకు పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, విద్యార్థులకు సెల్‌ఫోన్లు అనుమతించబడవన్నారు. పరీక్ష విద్యార్థులు టీఎస్‌బిఐఇ వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఏదైనా పరీక్షా కేంద్రాలలో ఇన్విజిలేజర్లు తక్కువగా ఉంటే ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులను ఎంఈవోల ద్వారా నియమించుకోవాలని ఆదేశాలున్నాయి. ఈ పరీక్షలను విజయవంతం గా నిరవ్హఙంచుటకు డీఈసీ మెంబర్లు గోవింగ్‌రామ్, సుధాకర్, నర్సిం లు, శ్రీనివాస్, జయరావు, అశోక్, హైపవర్ సభ్యులు, ఫైయింగ్ స్కాడ్స్ వెంకటేశం, విష్ణువర్థన్‌రెడ్డి, డీటి, ఒక ఎస్‌ఐ, 6 మంది సిట్టింగ్ స్వాడ్స్‌లను నియమించబడినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles