Thursday, April 25, 2024

తీవ్ర కరోనా రోగులకు మేలు చేసే టొసిలిజుమాబ్ డ్రగ్

- Advertisement -
- Advertisement -

Tocilizumab drug beneficial for acute corona patients

 

భారతీయ సంతతి శాస్త్రవేత్త బృందం పరిశోధన

బోస్టన్ : కరోనాతో తీవ్ర అస్వస్థులై ఆస్పత్రి పాలైన వారిలో మరణాల రేటును 30 శాతం వరకు యాంటీఇన్‌ఫ్లేమటరీ డ్రగ్ టొసిలిజుమాబ్ తగ్గించ గలదని అమెరికా లోని భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త బృందం తమ అధ్యయనంలో వెల్లడించింది. వ్యాధి నిరోధక శక్తిని అణచివేసే స్టెరాయిడ్స్‌కు భిన్నంగా ఈ డ్రగ్ ముఖ్యంగా ప్రో ఇన్‌ఫ్లేమేటరీ సైటోకైన్ ఐఎల్6 గ్రాహకాన్ని ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. హార్వర్డ్ అనుబంధ బ్రిఘమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు చెందిన శృతిగుప్తా, డేవిడ్ ఇ. లీఫ్ నేతృతంలో కరోనా రోగుల్లో టొసిలిజుమాబ్ డ్రగ్ ప్రభావంపై అధ్యయనం జరిగింది. రోగిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చిన మొదటి రెండు రోజుల్లో ఈ డ్రగ్‌ను రోగికి అందించారు. టొసిలిజుమాబ్ చికిత్స పొందని వారితో పోలిస్తే మరణాల రేటు 30 శాతం వరకు తగ్గడం కనిపించింది. సైటోకైన్ ఉత్పత్తికి సంబంధించిన వ్యాధిని ముఖ్యంగా క్యాన్సర్ రోగుల్లో కనిపించే ఈ లక్షణాల చికిత్సకు టొసిలిజుమాబ్ వినియోగిస్తుంటారని శాస్త్రవేత్త లీఫ్ చెప్పారు. ఈ అధ్యయనం జామా ఇంటర్నేషనల్ మెడిసిన్‌లో ప్రచురించారు. రుమటాయిడ్ ఆర్థ్రిరిటిస్, జైంట్ సెల్ ఆర్టెరిటిస్, చికిత్సకు టొసిలిజుమాబ్ అనుమతి పొందింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News