Home స్కోర్ మరో గెలుపు కోసం…

మరో గెలుపు కోసం…

vrt

ఆత్మవిశ్వాసంతో భారత్, లంకకు సవాల్, నేటి నుంచి చివరి టెస్టు

న్యూఢిల్లీ: శ్రీలంకతో శనివారం ప్రారంభమయ్యే చివరి టెస్టులో టీమిండియా విజయమే లక్షంగా పెట్టుకుంది. ఇప్పటికే రెండో టెస్టులో గెలిచి 10 ఆధి క్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రాగా ముగించినా కోహ్లి సేన ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంటుంది. టెస్టుల్లో వరుసగా 8 సిరీస్‌లను గెలిచిన టీమిండి యాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ప్రస్తుత సిరీస్‌లో లంకను ఓడిస్తే ఆస్ట్రేలియా పేరిట ఉన్న 9 సిరీస్‌ల విజయాన్ని సమం చేస్తోంది. చివరి మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్‌కు సిరీస్ దక్కుతోంది. దీంతో ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును భారత్ కూడా అందుకుంటుంది. ప్రస్తుతం టీమిండియా ఫాం ను పరిగణలోకి తీసుకుంటే కోహ్లి సేన ఈ సిరీస్‌ను గెలుచుకోవడం ఖాయ మని చెప్పవచ్చు. ఏదైన అనూహ్యం జరిగి శ్రీలంక చివరి టెస్టులో విజయం సాధిస్తే మాత్రం భారత్ అరుదైన రికార్డును సమం చేసే అవకాశాన్ని చేజార్చు కుంటుంది. మరోవైపు వరుస పరాజయాలతో సతమతమవుతున్న లంక కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును దక్కించుకోవాలని భావిస్తోంది. ఇటీవల కాలం లంక పేలవమైన ఆటతో వరుస ఓటములు చవి చూస్తున్న సంగతి తెలిసిందే. కిందటిసారి సొంత గడ్డపై భారత్ చేతిలో క్లీన్ స్వీప్‌కు గురైన లంకను ఈసారి కూడా ఓటమి భయం వెంటాడుతోంది. చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్న లంక ఆశలు అంత ఈజీగా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగా ల్లో చాలా బలంగా ఉన్న భారత్‌ను ఓడించడం మాట అటుంచి కనీసం డ్రాతో నైనా గట్టెక్కడం లంకకు శక్తికి మించి పనిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 20 తేడాతో సిరీస్ దక్కించుకోవాలనే లక్షంతో భారత్ కనిపిస్తోంది. ఇందులో గెలిచి రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఆత్మవి శ్వాసాన్ని పెంపొందించుకోవాలనే పట్టుదలతో కోహ్లి సేన ఉంది.
ఓపెనర్లేటేలంకతో కీలకం…
ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఓపెనర్లపై ఆశలు పెట్టుకుం ది. మురళీ విజయ్, లోకేష్ రాహుల్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. కిందటి మ్యాచ్‌లో మురళీ విజయ్ అద్భుతంగా ఆడాడు. అయితే రాహుల్ వైఫ ల్యం జట్టును వెంటాడుతోంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తప్ప రాహుల్ అంతగా రాణించలే దు. నాగ్‌పూర్ టెస్టులో కూడా అతను విఫలమ య్యాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం విజయ్‌తో కలిసి మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాలనే పట్టుదలతో ఉ న్నాడు. అతను రాణిస్తే జట్టుకు శుభారంభం దక్క డం ఖాయం. మరోవైపు కిందటి మ్యాచ్‌లో విజయ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిం దే. రాహుల్ విఫలమైనా వన్‌డౌన్‌లో వచ్చిన చటేశ్వర్ పుజారాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పా డు. ఈ మ్యాచ్‌లో కూడా మెరుపులు మెరిపించి రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టులో చోటు సంపాదించాలని తహతహలాడుతున్నాడు. కాగా, వ్యక్తిగత కారణాలతో రెండో టెస్టుకు దూరమైన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా జట్టులో చేరాడు. దీంతో మురళీకి తోడుగా అతన్ని బరిలోకి దించిన ఆశ్చర్యం లేదు. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లిదే తుది నిర్ణయమని చెప్పక తప్పదు. అతను ఎవరికి కోరుకుంటే వారే ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు.
జోరుమీదున్నారు…
మరోవైపు చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లిలు భీకర ఫాంలో ఉన్నారు. రెండో టెస్టులో అద్భుత సెంచరీతో కదం తొక్కగా, కోహ్లి ఏకంగా డబుల్ సెంచ రీ సాధించాడు. ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్ కనబరచాలనే పట్టుదలతో వీరున్నారు. వీరిద్దరూ చెలరేగితే లంక బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇటీవల కాలంలో పుజారా, కోహ్లిలు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. వరుస సెంచరీలతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ రాణించి వచ్చే దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో వాలని భావిస్తున్నారు. వీరిద్దరూ మరోసారి చెలరేగితే ఢిల్లీలోనూ భారత్‌కు భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది.
రహానెకు పరీక్ష!
కాగా, వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న భారత డాషింగ్ ఆటగాడు, వైస్ కెప్టెన్ అజింక్య రహానెకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ఈ మ్యాచ్ లోనూ విఫలమైతే రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక అవ్వడం కష్టమేనని చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన రహానె ఈ సిరీస్‌లో మాత్రం ఘోర వైఫల్యం చవిచూశాడు. మూడు ఇన్నింగ్స్ లను కలిపి కనీసం రెండంకెలా స్కోరును కూ డా అందుకోలేక పోయాడు. ఇప్పటి వరకు మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి ఆరు పరుగులు మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. కనీసం చివరి టెస్టులోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవస రం ఉంది. ఇందులో విఫలమై తే రానున్న సిరీస్‌లో చోటు సం పాదించడం కష్టమే. ఈ పరిస్థితుల్లో భారీ ఇన్నింగ్స్‌తో మళ్లీ ఫాంలోకి రావాలనే పట్టుదలతో రహానె ఉన్నాడు. ఇక, రెండో టెస్టులో సెంచరీ తో కదం తొక్కిన రోహిత్ శర్మ ఢిల్లీలోనూ రాణించాలనే పట్టుదలతో కని పిస్తున్నా డు. చాలా ఏళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీని అందు కున్న రోహిత్ ఆత్మ విశ్వా సంగా కనిపిస్తున్నా డు. ఈ మ్యాచ్ అతనికి పరీ క్షగా మారింది. జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకో వాలంటే ఇందులో రాణించక తప్పదు. అంతేగాక రానున్న దక్షి ణాఫ్రికా సిరీస్ జట్టులో చోటును ఆశి స్తున్న రోహిత్‌కు ఈ మ్యాచ్ సవాలు వంటి దేనని విశ్లేషకులు అంటున్నారు.
ఈసారి కూడా…
రెండో టెస్టులో సమష్టిగా రాణించిన బౌలర్లు ఈసారి కూడా అదే సంప్ర దాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. నాగ్‌పూర్ టెస్టులో ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా కీలక సమయంలో వికెట్లు తీసి జట్టుకు అండగా నిలిచారు. మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. రెండో టెస్టులో ఇషాంత్ అద్భుతంగా రాణించాడు. ఈసారి కూడా ఇషాంత్ జట్టుకు చాలా కీలకంగా మారాడు. ఇక, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో కూడిన మ్యాచ్ విన్నింగ్స్ స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. నాగ్‌పూర్‌లో వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. ఇక అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతనికి ఏడు వికెట్లు లభించాయి. జడేజా కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ఈసారి కూడా బంతితో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు.
చావోరేవో…
ఇదిలావుండగా రెండో టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన శ్రీలంకకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే లంక ఈ మ్యా చ్‌లో కచ్చితంగా గెలవాలి. డ్రా చేసిన సిరీస్ భారత్ వశమవుతోంది. ఈ పరిస్థి తుల్లో భారత్‌ను ఓడించేందుకు లంక ప్రణాళికలు రచిస్తోంది. తొలి టెస్టులో అసాధారణ రీతిలో చెలరేగిన స్పీడ్‌స్టర్ లక్మల్ నాగ్‌పూర్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. అయితే ఫాస్ట్ బౌలర్లకు సహకరించే ఢిల్లీ మైదానంలో చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. దాసున్ శనక, లహిరు గమాగె, విశ్వఫెర్నాండో, దిల్రువన్ పెరీరాల తో లంక బౌలింగ్ కాస్త బలంగానే ఉంది. అయితే సీనియర్ బౌలర్ రంగన హెరాత్ గాయం వల్ల చివరి టెస్టుకు దూరమ య్యాడు. అతనికి బదులు యువ సంచలనం ధనంజయ డిసిల్వా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరో వైపు సిరీస్‌లో ఇప్పటి వరకు ఆశించని విధంగా రాణిం చని బ్యాట్స్‌మెన్ ఢిల్లీలో మెరుగైన ఆటను కనబరిచేం దుకు సిద్ధమయ్యారు. ఓపెనర్లు సమరవిక్రమ, దిము త్ కరుణరత్నె, కెప్టెన్ చండీమల్, లాహిరు తిరిమన్నె, వికెట్ కీపర్ డిక్వెల్లా, మాజీ కెప్టెన్ మాథ్యూస్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సమష్టి పోరాటంతో భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలనే లక్షంతో లంక ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్‌కు కాస్త గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జట్ల వివరాలు
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, లోకేష్ రాహుల్, చటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి.
శ్రీలంక: దినేష్ చండీమల్ (కెప్టెన్), సమర విక్రమ, కరుణరత్నె, తిరిమన్నె, మాథ్యూస్, డిక్వెల్లా, దాసున్ శనక, దిల్రువన్ పెరీరా, జెఫ్రి వండర్‌సె, సురంగ లక్మల్, లహిరు గమాగె, ధనంజయ డిసిల్వా, లక్షన్ సండకాన్, విశ్వ ఫెర్నాండో, రోషన్ సిల్వా.