Home తాజా వార్తలు నేడు ప్యాక్స్ ఎన్నికలు

నేడు ప్యాక్స్ ఎన్నికలు

primary agricultural cooperatives

 

హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవం కాగా మిగిలిన 6,248 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికలకు రాష్ట్ర సహకాల ఎన్నికల అథారిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 14,530 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. 11.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో వార్డుకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్దతిలో ఎంపిక చేస్తారు. ఆ లాటరీలో ఎంపికైన అభ్యర్థికి మిగిలిన వారికన్నా ఒక్క ఓటు ఎక్కవ వచ్చినట్లు పరిగణించి, ఆ అభ్యర్థి ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు.

ఎక్కడైనా, ఏదైనా సమస్య ఉంటే అధికారులను సంప్రదించాలి. ప్రభుత్వ నిబంధనలు, కో ఆపరేటివ్ చట్టం మేరకు ఎన్నికలు నిర్వహణ ఉంటుంది. రాష్ట్రంలో 904 ప్యాక్స్‌ల పరిధిలోని 11,653 డైరెక్టర్ స్థానాలకు సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణ తరువాత రాష్ట్రంలోని 157 ప్యాక్స్‌ల పరిధిలోని డైరెక్టర్ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 11,654 వార్డులలో ఏకంగా 47 శాతం ఏకగ్రీవమయ్యాయి. వీటన్నింటినీ టిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 16వ తేదీన ఎన్నికైన డైరెక్టర్ల ద్వారా ప్యాక్స్‌లకు ఛైర్మెన్‌లను, వైస్ ఛైర్మెన్‌లను ఎన్నుకుంటారని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. టిఆర్‌ఎస్ సహకార ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంంది. మొత్తం 90 శాతంకు పైగా ప్యాక్స్‌లను కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచించారు. తద్వారా అన్ని డిసిసిబిలు టిఆర్‌ఎస్ వశం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

Today Election to primary agricultural cooperatives