Home తాజా వార్తలు పోలీసు అమరవీరులకు సెల్యూట్

పోలీసు అమరవీరులకు సెల్యూట్

Police Martyrdom Commemoration

 

త్యాగానికి ప్రతిరూపం పోలీసులు
శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం
పండుగ పబ్బాలు వచ్చిన కుటుంబాలకు దూరం
శత్రువులతో నిత్యం పోరాటం చావుతో చెలగాటం

యాదాద్రిభువనగిరి : ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ, పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసుకి, అందునా ప్రాణాలన్ని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత. పోలీసులుగా బాధ్యత నిర్వహించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం. పోలీసు అమర వీరులను స్మరించుకునే రోజు నేడు. దీనికి మహోన్నత చరిత్ర ఉన్నది. భారత్ చైనా సరిహద్దులో ఉన్న లడక్‌లోని అక్పాయ్‌చిన్ వద్ద కేంద్ర రిజర్వు పోలీసు దళం(సీఆర్‌ఫీఎఫ్) సరిహద్దు రక్షణలో ఉన్నారు.

1959 అక్టోబరు 21న విపరీతమైన చలిలో పదిమంది సీఆర్‌ఫీఎఫ్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా చైనాకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మనదేశ సరిహద్దులోకి చొచ్చుకు వచ్చారు. వారిని ఈ పదిమంది పోలీసులు ధైర్యంతో ఎదిరించి చివరి రక్తపు బోట్టు వరకు పోరాడి దేశం కోసం అసువులు బాశారు. భారతదేశ రక్షణ కోసం పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమై అక్టోబరు 21న ‘పోలీసు అమర వీరుల సంస్మరణ దినం’గా పాటించాలని తీర్మానించారు. ఆనాటి నుంచి నేటి వరకు దేశ వ్యాప్తంగా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సం స్మరణ దినంగా పాటిస్తున్నారు. అమర పోలీసుల వీర త్యాగాన్ని స్మరివంచుకుని వారి కుటుంబాలకు సానుభూతిని, సహకారాన్ని ప్రకటించి వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాం. పోలీసు సేన అంటే ఏమిటి? పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది.

ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు. 24 గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే… ప్రభుత్వం అంటే ముందుగా గు ర్తుకొచ్చేది పోలీసే.. అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారు. సంపన్నుడుతో మొదలు పెట్టి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికి సాయం కోరేది పోలీసులనే.. దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే.. అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. శాంతి భద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నియంత్రించడం పోలీసు కర్తవ్యం. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు.

ప్రజలకు సేవ చేయడమంటే ప్రత్యక్ష పరమాత్మునికి సేవ చేయడమే… అందుకే పెద్దలు మానవసేవే మాధవ సేవ అన్నారు. ప్రజాసేవలో ఉండే వారి ను ంచి నీతి, నిజాయితీ, అంకితభావం, మానవత్వం, త్యాగం వంటి లక్షణాలను సమాజం ఆశిస్తుంది. ఎంత చేశామన్నది కాదు ఎలా చేశావన్నది ముఖ్యమని సమాజం అంటుంది. 24 గంటలు ప్రజల మధ్య ఉండే పోలీసు నుంచి కూడా ఇటువంటి విలువలనే సమాజం కోరుకుంటుంది. పోలీసుల త్యాగనిరతి అమోఘమైనది. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. పోలీసులు దేశం, రాష్ట్రం, ప్రజల కోసం వారి విలువైన ప్రాణాలర్పించినప్పటికీ ఆ త్యాగాలు తగినంతగా గుర్తింపులు నోచుకోవడంలేదు.

ఈ త్యాగాలను గుర్తించి ఆ త్యాగమూర్తులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. దేశ సరిహద్దులలో సైనికులు, అంతర్గత శత్రువులతో పోలీసు అసువులు బాస్తున్నారు. వారి త్యాగాల గురించి ఈ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా ఒక్క నిమిషం ఆలోచించి గుర్తించినా పోలీసులు సంతోషిస్తారు. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్ధేశం.

Today is the day of Police Martyrdom Commemoration