Friday, January 27, 2023

వ్యాపారాలు డీలా

- Advertisement -

money*పెద్దనోట్ల రద్దుతో చితికిన చిన్న బతుకులు
*కొనుగోళ్లు లేక సాగిలపడ్డ వ్యాపారం
*తీవ్ర ఇబ్బందులు పడ్డ సామాన్యుడు
*పనులు మానుకుని గంటల తరబడి క్యూలైన్లోనే….
*నేటితో నోట్ల రద్దుకు ఏడాది

2016 నవంబర్ 8న అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు అవుతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు… ఆ తరువాత పెద్ద నోటు మార్పు కోసం బ్యాంకుల ఎదుట పడిగాపులు.. మరోవైపు  డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులు, ఎటిఎం సెంటర్ల వద్ద బారెడంత క్యూలైన్లు… ఇలా సామాన్యులు అష్టకష్టాలు పడగా, వ్యాపారులు కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలా నాలుగైదు నెలల నోటు కష్టాలు అందరినీ వెంటాడాయి.. నేటితో నోట్లు రద్దై ఏడాది పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక కథనం….

జనగామ: గత సంవత్సరం నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంవత్సరం గడిచింది. దేశంలోని నల్లడబ్బును వెలికితీయాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ఏడాదికాలంలో సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య లావాదేవీలు కొనసాగుతున్నాయి. నోట్ల రద్దు ప్రారంభంలో సామాన్యుడితోపాటు అందరికీ సమస్యలు ఎదురయ్యాయి. బ్యాంకులో నగదు అందక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు ఆశాజనకంగా ఉన్నాయే తప్ప ప్రభుత్వం ఊహించిన విధంగా ఈ లావాదేవీలు జరగడం లేదు.
పెద్ద నోట్ల రద్దు చేయడం మంచిదే…
తేలి అశోక్, ప్రముఖ వ్యాపారి
ప్రభుత్వ లక్షం మంచిదే. అయిన్నప్పటికీ ఎన్ని నోట్లు రద్దాయ్యాయో వాటికి అనుగుణంగా కొత్త నోట్ల సరఫరా చేసినట్లయితే సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా ఉండేవి. చిన్న నోట్లు దొరకక 2,000వేల నోట్లు రావడంతో కొంతమేరకు వ్యాపారాలు స్థంబించాయి. రానురానూ సమస్యలు సర్ధు ప్రభుత్వం సరఫరా చేసిన నోట్లు మళ్లీ కొరత ఏర్పడుతుందనే భయంతో ఎవరికి వారే డబ్బులను దాచుకుంటున్నారు.
సామాన్యులకు ఇబ్బంది…
ఎండి గౌస్, చిరు వ్యాపారి
ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతో చిల్లర దొరకక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వ్యాపారం సాగక ఆర్థికంగా కొంతమేరకు నష్టపోయాం. ప్రస్తుతం 500, 200, 50నోట్లు రాకతో కొంతవరకు సమస్యల సద్దుమణిగా యి. పెద్ద నొట్ల రద్దు ప్రారంభంలో 2000 నో ట్లు ప్రవేశపెట్టడంతో చిల్లర దొరకక నోటు తీసుకోవాలంటే బయపడ్డాం.
అవగాహన కల్పించాలి
సంతోష్, కిరాణ జనరల్ వ్యాపారి
పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తే బాగుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles