Home రాష్ట్ర వార్తలు నేడు మహాశివరాత్రి

నేడు మహాశివరాత్రి

templeహైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. సోమవారంనాటి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తనుండడంతో ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడలోని రాజరాజేశ్వర దేవాలయం, కీసరగుట్ట, వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, పాలకుర్తిలోని సోమేశ్వరాలయం, నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు వద్ద జడల పార్వతీ రామలింగేశ్వర స్వామి, పానగల్లులోని పచ్చల సోమేశ్వరాలయం తదితర క్షేత్రాలను అలంకరించారు. విద్యుదీప కాంతుల్లో వేములవాడ ఆలయం వెలిగిపోతోంది. మరోవైపు భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శైవ క్షేత్రం శ్రీశైలంకు ఈనెల 8 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు.