- Advertisement -
మన తెలంగాణ/ మేడారం: తెలంగాణ కుంభమేళా నాలుగు రోజుల వనదేవతల సంబురం మేడారం జాతర నేడు ఘనంగా ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జనజాతర ను తిలకించడానికి అన్ని దిక్కుల నుంచీ భక్తులు తరలి రావడంతో మేడారం ప్రజా సముద్రంగా మారిపోయింది. ఆర్‌టిసి బస్టాండ్, జంపన్న వాగు, చిలకలగుట్ట తదితర ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. జాతరను విజయంవంతానికిఅధికారులు నిమగ్నమయ్యారు. జాతర ప్రారంభం నుంచి ముగిసే శనివారం సాయంత్రం వరకు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కర్ణన్, స్పెషల్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -