Home కామారెడ్డి క(ల్తీ)ల్లు కిక్కే..కిక్కు

క(ల్తీ)ల్లు కిక్కే..కిక్కు

toddy

బాన్సువాడ టౌన్: కల్తీ కల్లు భూతం సామాన్యులను కాటేస్తోంది. మోతాదుకు మించి డోస్ పడుతుండటంతో కల్లు ప్రియులు చాలా సఫర్ అవుతు న్నారు. తాగితే చాలు… ఒళ్లు మరిచి అక్కడే నిద్రపోతు న్నారు. కల్లు పాకలోనే కాకుండా ఆరుబయట రోడ్లపై కూడా చిత్తుగా పడిపోతున్నారు. బాన్సువాడ పట్టణం లోని ఓ కల్లుపాక ఎదుట రోడ్డుపై కల్లు సేవించి పడిపోతు న్నారు. అలాగే వీక్లీ మార్కెట్, సాయిబాబా టెంపుల్, సంగమేశ్వర కాలోనీ ప్రాంతాలలో కల్లుప్రియులు రోడ్డు పై పడిపోతుండటంతో వారివారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రోడ్డుపై వాహనాల రాకపోకలతో తాగిన మత్తులో ఏప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన కలుగుతోంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఇలాంటి ఘటణలు చోటు చేసుకుంటున్నాయి. కల్తీకల్లు అమ్మ కాలు జోరుగా సాగుతున్నప్పటికీ ఆబ్కారీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఈ దందా కొనసాగు తోంది. చిన్నచిన్న పిల్లలు సైతం కల్లుపానానికి బానిసలై తూగుతున్నారు. చిన్నారులకు కల్లు అమ్మరాదన్న నిబం ధనలను కల్లు వ్యాపారులు బేఖాతర్ చేస్తున్నారు. కల్లులో ప్రమాదకరమైన మత్తు పదార్థాలను కలుపుతూ ప్రజారో గ్యంతో చెలగాటమాడుతున్న కల్లు వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.