Friday, March 29, 2024

మత్తు… మారణకాండ!

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే కల్తీ కల్లుతో ముగ్గురు మృతి, మృత్యువు అంచున మరెందరో ?, కల్లు మత్తుతో చిత్తవుతున్న జీవితాలు, పాపం అంతా ఎక్సైజ్ శాఖ అధికారులదే, అంతా రసాయనాలతో తయారు చేసే కృత్రిమ కల్లు, క్లోరోహైడ్రేడ్‌కు అల్పాజాలంకు బానిసలవుతున్న ప్రజలు, వీటిసి సేవిస్తే 40 ఏళ్లకే జీవితం ముగింపు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యథేచ్ఛగా కల్తీకల్లు, బయటికి వచ్చినప్పుడే హడావుడి,తర్వాత యధా రాజ తధా ప్రజా 8నెల మామూళ్లతో మత్తులో ఉంటున్న అధికారులు

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్:  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీకల్లు మత్తు లో ప్రజల జీవితాలు బుగ్గీ అవుతున్నాయి. కల్లు త యారీలో నిబంధనలకు పాతరేస్తున్న కల్లు సిండికే ట్, ప్రజల ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. దోపిడే పరమాధిగా భావించి కోట్లు కొల్లగొట్టుకుంటున్నారు.వచ్చిన దాంట్లో తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ప్రజల ప్రాణ సొమ్మును పంచుకుతింటున్నారు. ఈ నేపథ్యంలో రసాయానాలతో కల్లును తయారు చేస్తూ రహస్య మారణకాండకు కారకులవుతున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో క లుస్తున్నా అటు అబ్కారీ శాఖ అధికారులకు చీమ కుట్టినట్లైనా లేదు.

Also Read:  ‘నారాయణ అండ్ కో’ నుంచి ‘దండక డన్ డన్’ పాట విడుదల

నెల మామూళ్లు తీసుకుంటుండడంతో అటు వైపు వెళ్లి తనఖీలు చేయడమో, చర్య లు తీసుకోవడమో చేయడం లేదనే ఆరోపణలు తీ వ్రంగా ఉంటున్నాయి.గత కొన్ని రోజులుగా ఉమ్మ డి మహబూబ్‌నగర్ జిల్లాలో పట్టణ కేంద్రంతో పా టు వనపర్తి, నవాబు పేట, జడ్చర్ల, ఎనుగొండ, దొ డ్లలోని పల్లె, కోయ నగర్,తదితర ప్రాంతాల్లో కల్తీకల్లు సేవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది చికిత్స పొందుతున్నారు. వీరి లో మరి కొంత మందికి సీరియస్‌గానే ఉన్నట్లు స మాచారం. అయితే ఇంత పెద్ద సంఘటన జరిగినా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు అబ్కారీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేయడం పలు విమర్శలు,ఆరోపణలకు తావిస్తోంది. మరో వైపు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ విషయా న్ని ప్రచారం కాకుండా ఉండేందుకు మీడియా ను లోపలికి రానీయకుండా అడ్డకోవడం బట్టి చూస్తుంటే ఈ వ్యవహారంలో సిండికేట్ పాత్ర ఎంత బలంగా ఉందో అన్న అనుమానా లు వ్య క్తం అవుతున్నాయి. కల్తీకల్లుతో మరణించిన వారి కుటుంబీకులతో రహ స్య ఒప్పందం చేసుకొని కొ ంత నగదను ఇచ్చి కేసులు లేకుండా చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

క్లోరోహైడ్రేడ్, అల్పాజాలంకు బానీసలవుతున్న ప్రజలు …

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అసలు కల్లు కంటే కృత్రిమ కల్లే లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. చట్ట ప్రకారం ప్రజలకు ఆరోగ్యకరమైన కల్లు పంపిణీ చేయాలని, అంటే ఈత, తాటి చెట్ల నుంచి వచ్చే ఒరిజినల్ కల్లును లైసన్స్ దారులు సేకరించి విక్రయించుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం లైసన్సులు జారీ చేస్తుంది. ఈ లెక్కన అంతా ఒరిజినల్ కల్లు ఉందని చెప్పి అబ్కారి శాఖ అధికారు లు ఉమ్మడి జిల్లా వ్యాప్త ంగా 1000కి పైగా కల్లు డిపోలకు లైసన్స్ జారీ చేసింది. అనుమతి లేని కల్లు డిపోలకు ఇక లెక్క నే లే దు. డిపోల సిండికేట్ దా రులు అంతా రసాయానాలతో కూడిన కల్లునే విక్రయిస్తున్నారు.

క్లోరోహైడ్రేడ్, అల్పాజాలం, డైజోఫాం, వంటి మనిషి ప్రాణానికి హాని చేసే ర సాయానాలు కలప కూడదు. ఇవి మోతాదు ఎక్కువైనా ప్రమాదమే. వీటికి అలువాటు పడిన ప్ర జలు వాటితో కూడిన కల్లు ఒక్క రోజు లేక పోతే ఉ ండలేని పరిస్ధితి ఏర్పడుతుంది. వారిలో హిస్టీరియా ( పిచ్చి పిచ్చి చేయడం) మొదలు అవుతుం ది. దీంతో కల్లు వ్యాపారులు పంట పండుతోంది. ప్రజలకు రసాయానాలతో కూడి కల్లును అలువాటు చేసి, అది లేక పోతే ఉండని స్థితిని కూడా కల్పించా రు. ఇప్పడు విడవమంటే పాముకు కోప ం, కరవ మంటే కప్పకు కోపం అన్నట్లు రసయానాలు కలపక పోతే ప్రజలే డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడింది.

Adulterous toddy in Metpally

కలిపితే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏ ర్పడే పరిస్థితి ఏర్పడింది. అసలు రసాయానాలు కలపకుండా ని దానంగా ప్రజలకు నిరంతరం కౌన్సిలింగ్ కల్పిస్తూ మాన్పించే అధికారం సంబందిత అధికారులకు ఉ ండాలి. కాని అందరికి కాసులు కురిపించి కల్తీ క ల్లును ఎలా నిలుపుదల చేస్తారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. గుడుంబాను క్షణాల్లో ఆరికట్టిన ప్రభు త్వం, కల్తీ కల్లును అరికట్ట లేదా అంటే అనుకుంటే అరికట్టవచ్చు.అందులో బడాబడా కల్లు నాయకు లు ఉండడంతో ప్రభుత్వం ఈ పనికి పూనుకోక పో వచ్చునని అంటున్నారు.దీంతో కల్తీకల్లుకు రహస్య ంగా జరిగే మారణ కాండకు ఎవరు బాధ్యులు అనే చర్చ జరుగుతోంది.కొన్ని స ంవత్సరాలుగా ఈ కల్తీకల్లు సేవించిన ప్రజలు 40 ఏళ్లకే జీవితాలను ముగించుకోవాల్సిన దుస్తితి ఏర్పడింది.

సేకరించిన శ్యాంపిల్స్‌లో ఏమి తేలుతుంది ?

ఇటీవల కల్తీకల్లు తో జరిగిన మరణాలపై మంత్రి స ంబంధిత అధికారులపై సీరియస్ అయ్యారు. జరిగిన మరణాలు ఇతరత్రా కారణాలతో జరిగినట్లు తెలిపారు. అధికారులను విచారణకు అదేశించామని, వాస్తవాలు బయటికి వచ్చే అ వకాశాలు ఉన్నాయన్నారు. శ్యాంపిల్స్ సేకరించి పి ఎస్‌ఎల్ ల్యాబ్‌కు పంపామని అందులో కల్తీకల్లు ఆనవాళ్లు వస్తే సంబంధిత కల్లు తయారి దారులపై సీరియస్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. త మ ప్రభుత్వంకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని వ్యా ఖ్యానించారు. కల్తీకల్లుతో చనిపోయిన వారి పోస్టు మార్టం నివేదికలు, సేకరించిన కల్లు శ్యాంపిల్స్ ని వేదికలు ఏమి చెబుతాయని ఆసక్తిగా ఎదురు చూ స్తున్నారు. శనివారం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా అబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి 160 శ్యాంపిల్స్ సేకరించారు.

దాడులు ఉంటాయ న్న ముందస్తు సమాచారం ఉండడంతో కల్లు సిండికేట్ అప్రమత్తమై ఎలాంటి రసాయానాలు లేని కల్లును ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు గతంలోనూ ప్రస్తుతం సేకరించిన కల్లులో ఎలాంటి ప్రమాదకర అనవాళ్లు ఉండే పరిస్థితి ఉంటుందా అనేది కూడా అనుమానంగా ఉంది. క్లోరోహైడ్రేడ్, ఆల్పాజోలం,డైజోఫాంలును కల్తు ఎదుటే కలుపుతున్నా, ప్రజల కల్లకు కనబడుతున్నా సంబందిత అధికారులకు కనబడడం లేదా అని ప్రశ్నిస్తున్నా రు. కల్లులో ప్రాణాలకు హాని కరమైన రసాయానాలు కలపని ఒరిజినల్ కల్లు విక్రయాలు జరిపేలా ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటారను కోవడం కూడా ఒట్టి బ్రమనేనని అంటున్నారు. మాంసానికి అలువాటు పడ్డ మృగాల్లాగ, మామూళ్లకు అలువాటు పడిన అధికారులు నిజాయితిగా వ్యవహరిస్తారా అన్నది చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News