Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి

ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి

 

collector

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్

మన తెలంగాణ/ఆసిఫాబాద్ : గ్రామాలలో ప్రతీ ఇంటికి మరుగుదొడ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ చంపాలాల్ సూచించారు. మండలంలోని చిర్రకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని యాపల్‌పాటి గ్రామాన్ని సందర్శించి గ్రామాలలో నిర్మిస్తున్న మరుగుదొడ్లను పరిశీలించారు. రూర్‌బన్ పథకం ద్వారా రూ. 20లక్షలతో సీసీరోడ్లు, మరుగుదొడ్లను ఏర్పాట్ల పనులను పర్యవేక్షించారు. మరుగుదొడ్ల నిర్మాణంపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పర్చాలన్నారు. తుంపల్లిలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరుపట్టికను పరిశీలించి ఉపాధ్యాయుల గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనానికి మెనూ పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసి విద్యార్థులను పాఠశాలకు వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి నిర్మాణంలో ఉన్న డిజిటల్ రూం, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్‌ను పరిశీలించి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయించాలని డీఈఓను ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ చంపాలాల్ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. వైద్యులు సకాలంలో హాజరవుతున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యశాఖ కార్యాలయాన్ని పాత ఆసుపత్రి భవనంలోకి మార్చాలని, సదరం శిబిరాన్ని నూతన ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సిబ్బంది వైద్యుల కొరత ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా త్వరలోనే వైద్యులను భర్తీచేయిస్తామన్నారు. ఈయన వెంట డిఆర్‌డిఏ పిడి శంకర్ , డీఈఓ రఫీక్, ఎంపిడిఓ శ్రీనివాస్, పీఆర్‌ఓ తిరుమల, తదితరులు ఉన్నారు.