Thursday, April 25, 2024

13 ఏళ్లకే ఒలింపిక్ స్వర్ణం.. చరిత్ర సృష్టించిన జపాన్ స్కేటర్

- Advertisement -
- Advertisement -

టోక్యో: జపాన్ యువ సంచలనం మోమిజి నిషియా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. 13 ఏళ్ల మోమిజి నిషియా మహిళల స్కేట్ బోర్డింగ్ విభాగంలో పసిడి పతకం సాధించింది. ఈ క్రమంలో అత్యంత చిన్న వయసులో స్వర్ణం సాధించిన తొలి అథ్లెట్‌గా మోమిజి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ప్రస్తుతం మోమిజి వయసు 13 ఏళ్ల 330 రోజులు. స్కేట్ బోర్డింగ్‌లో మోమిజి ఇటు రన్ అటు ట్రిక్ విభాగంలో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఈ క్రమంలో రన్‌లో 3.02, ట్రిక్‌లో 4.15, 4.66, 3.43 స్కోర్లు సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

Tokyo Olympics:Japan’s 13 years old skater won gold medal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News