Home తాజా వార్తలు పేకాటలో పట్టుబడిన నటుడు కృష్ణుడు

పేకాటలో పట్టుబడిన నటుడు కృష్ణుడు

Tollywood Actor Krishnudu Arrest By SOT Policeహైదరాబాద్‌: ప్రముఖ నటుడు కృష్ణడు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కాడు.  మియాపూర్‌లోని ఓ విల్లాపై శుక్రవారం రాత్రి ఎస్ఒటి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడు పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.  ఆయనతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్‌లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కలిసి కృష్ణుడు పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.  పేకాటరాయుళ్లను మియాపూర్‌ పోలీసులకు ఎస్ఒటి పోలీసులు అప్పగించారు. వ్యక్తిగత పూచీకత్తుపై నిందితులను పోలీసులు విడిచిపెట్టారు. శనివారం సాయంత్రం విచారణకు రావాలని వారిని ఆదేశించారు. కృష్ణుడు పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.