Home తాజా వార్తలు మనిషికి డబ్బే ముఖ్యం….

మనిషికి డబ్బే ముఖ్యం….

Actor Nagababuహైదరాబాద్ : ప్రస్తుత కాలంలో మనిషికి డబ్బే ముఖ్యమని ప్రముఖ నటుడు నాగబాబు తేల్చి చెప్పారు. డబ్బు కంటే బంధాలు, అనుబంధాలు, మానవత్వం, వ్యక్తిత్వం గొప్పవని చెబుతుంటారని, కానీ వాటికంటే డబ్బే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మనిషి జీవితంలో డబ్బుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదని, డబ్బును సద్వినియోగం చేసుకోగలితే మంచిదని ఆయన చెప్పారు. ఒకప్పుడు డబ్బులు లేక తాను ఎంతో ఇబ్బంది పడ్డానని, 49 ఏళ్ల వయస్సులో తనకు డబ్బు విలువ తెలిసిందని, డబ్బు సంపాదించాలన్న కసి తనలో పెరిగి చాలా డబ్బు సంపాదించానని నాగబాబు స్పష్టం చేశారు.  ‘ది రిచ్చెస్ట్‌ మ్యాన్‌ ఇన్‌ బాబిలాన్‌’ అనే పుస్తకం చదవాలని ఆయన చెప్పారు ఈ పుస్తకం చదివితే డబ్బు విలువ తెలుస్తుందని, ప్రస్తుత సమాజంలో డబ్బు ఉన్నవారే బలవంతులని ఆయన పేర్కొన్నారు.

Tollywood Actor Nagababu Comments on Money