Home తాజా వార్తలు డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటుడు నందు

డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటుడు నందు

Tollywood Actor Nandu Attend Before ED Officersహైదరాబాద్‌ : టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో నటీనటులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ, నటి రకుల్ ప్రీత్ సింగ్ ను ను ఈడీ అధికారులు విచారించారు. ఈ క్రమంలో మంగళవారం నటుడు నందును ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీంతో నటుడు నందు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. బుధవారం ఈడీ అధికారులు ప్రముఖ నటుడు రానా దగ్గుబాటిని విచారించనున్నారు.