Home తాజా వార్తలు ఎపి సిఎం జగన్ తో హీరో మంచు మనోజ్ భేటీ

ఎపి సిఎం జగన్ తో హీరో మంచు మనోజ్ భేటీ

Tollywood Hero Manchu Manoj Meets AP CM Jaganఅమరావతి : ఎపి సిఎం జగన్ తో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భేటీ అయ్యారు. జగన్ ను తాను మర్యాదపూర్వకంగా కలిసినట్టు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. జగన్ ను కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. భవిష్యత్ తరాల కోసం జగన్ దూరదృష్టివ, ప్రణాళికలు తనను ఎంతగానో ఆకర్షించాయని మనోజ్ పేర్కొన్నారు.  రాష్ట్ర అభివృద్ధి పట్ల జగన్‌కు ఉన్న దార్శనికతకు ముగ్దుడినయ్యానని, ఆయన పరిపాలనకు అభినందనలు తెలుపుతున్నానని మనోజ్ వెల్లడించారు. ఇటీవల తన డ్రీం ప్రాజెక్ట్ కోసం తెలంగాణ మంత్రులు కెటిఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లను మనోజ్ కలిశారు.