Home తాజా వార్తలు కొత్త లుక్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

కొత్త లుక్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

Tollywood Hero Prabhas In New Lookహైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు.  `రాధేశ్యామ్`, `సలార్`, `ఆదిపురుష్` సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. తాజాగా ప్రభాస్ సరికొత్త లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఈ లుక్ ఆకట్టుకునేవిధంగా ఉంది. `ఆదిపురుష్`లోని రాముడి పాత్ర కోసమే ప్రభాస్ మీసకట్టు మార్చారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఈ ఏడాది `రాధేశ్యామ్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూలై 30న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా షూటింగ్  ఇప్పటికే పూర్తయింది.  ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వాలైంటెన్స్ డే సందర్భంగా  `గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్` ను విడుదల చేశారు.  ప్రభాస్ ప్రస్తుతం `సలార్` షూటింగ్ తో బిజీగా ఉన్నారు. త్వరలోనే `ఆదిపురుష్` షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది.