Home తాజా వార్తలు రవితేజ కొత్త సినిమా ‘క్రాక్’

రవితేజ కొత్త సినిమా ‘క్రాక్’

Tollywood Hero Ravi Tejaహైదరాబాద్ : మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ‘డిస్కోరాజా’లో నటిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించనున్నారు. ఈ సినిమాకు ‘క్రాక్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. రవితేజకు ‘క్రాక్’ 66వ సినిమా కావడం గమనార్హం. ఈ సినిమాలో రవితేజ ఫవర్ పుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రుతి హాసన్ నటించనున్నారు. కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. వరలక్ష్మికి తెలుగులో ఇది రెండో సినిమా కావడం గమనార్హం. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Tollywood Hero Ravi Teja New Movie Crack