Home తాజా వార్తలు నిర్మాతగా మారనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

నిర్మాతగా మారనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

Tollywood Hero Young Tiger NTRహైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్మాతగా మారుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఆపై మరో సినిమాతో ఆయన బిజీ కానున్నారు. ఇదిలా ఉండగా సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి నిర్మాతగా మారనున్నట్టు వార్తలు వస్తున్నాయి. సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మించడంతో పాటు తనతో సినిమాలు తీసే వారితో భాగస్వామ్యం కావడం, ఇతర హీరోలతో సినిమాలు తీయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహేశ్ బాబు, రాంచరణ్, కల్యాణ్ రామ్, నాని, విజయ దేవరకొండ తదితర హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. వారి బాటలోనే ఎన్టీఆర్ కూడా సాగనున్నట్టు టాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Tollywood Hero Young Tiger NTR To Become Producer