Home తాజా వార్తలు ‘90ఎం.ఎల్’ టీజర్ విడుదల

‘90ఎం.ఎల్’ టీజర్ విడుదల

Tollywood Movie 90MLహైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా సినిమా ’ 90ఎం.ఎల్’. కార్తికేయ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను శనివారం విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ రెడ్డి ఎర్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హీరో కార్తికేయ ఈ సినిమాలో దేవదాసు పాత్రలో కనిపించనున్నారు. కార్తికేయ ఆర్ ఎక్స్ 100, హిప్పీ, గుణ369, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ’ 90ఎం.ఎల్’. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. మరో మూడు పాటలను యూరప్ లో చిత్రీకరణ చేయనున్నారు.  ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందన్న ఆశాభావంతో నిర్మాత ఉన్నారు.

Tollywood Movie 90ML Teaser Release