Home తాజా వార్తలు తేజ దర్శకత్వంలో `చిత్రం` సినిమాకు సీక్వెల్

తేజ దర్శకత్వంలో `చిత్రం` సినిమాకు సీక్వెల్

Tollywood Movie Chitram Sequel In Teja Directionహైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు తేజ తన దర్శకత్వంలో తొలిసారిగా 2000లో రూపొందించిన సినిమా ’చిత్రం‘. నాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాతోనే ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరో హీరోయిన్లుగా, ఇంకా పలువురు కొత్త నటీనటులు వెండితెరకు పరిచమయ్యారు. ఈ సినిమాతో ఆర్ పి పట్నాయక్ సంగీత దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త నటీనటులతో రూపొందిన ఈ సినిమా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత సీక్వెల్ ను రూపొందించేందుకు తేజ సన్నాహాలు చేస్తున్నారు. ’చిత్రం‘ సినిమాకు సీక్వెల్ గా ’చిత్రం1.1‘ రాబోతోందని తేజ ప్రకటించారు. ఈ సినిమాకు కూడా పట్నాయక్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా ద్వారా సుమారు 45 మంది కొత్త వారిని వెండితెరకు పరిచయం చేయాలని తేజ నిర్ణయం తీసుకున్నారు.  తేజ సొంత నిర్మాణ సంస్థ `చిత్రం మూవీస్`, `ఎస్ స్టూడియోస్` ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరించనున్నారు.  మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.