Home తాజా వార్తలు ’సీటీమార్‘ టీజర్ విడుదల

’సీటీమార్‘ టీజర్ విడుదల

Tollywood Movie Seetimaar Teaser Releaseహైదరాబాద్ : యంగ్ హీరో గోపీచంద్, హీరోయిన్ తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ’సిటీమార్‘. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కతున్న ఈ సినిమాలో గోపీచంద్, తమన్నాలు కబడ్డీ కోచ్ లు గా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సోమవారం ఉదయం నిర్మాతలు విడుదల చేశారు. టీజర్ ఆకట్టుకునేవిధంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఏప్రిల్ 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా,  సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నారు.