Home తాజా వార్తలు ‘ షాదీ ముబార‌క్’ టీజర్ విడుదల

‘ షాదీ ముబార‌క్’ టీజర్ విడుదల

Tollywood Movie Shaadi Mubarak Teaser Releaseహైదరాబాద్ : మొగలిరేకులు సీరియల్ ఫేం సాగర్ నటిస్తున్న తాజా సినిమా ’షాదీ ముబార‌క్‌‘.  సిద్దార్థ‌, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సినిమాల త‌ర్వాత సాగ‌ర్ న‌టిస్తున్న మూడో సినిమా ’షాదీ ముబార‌క్‌‘. ఈ సినిమా టీజర్ ను మంగళవారం నిర్మాతలు విడుదల చేశారు. ఈ టీజర్ ఆకట్టుకునేవిధంగా ఉంది. ఈ సినిమాతో హిట్ కొట్టాలన్న పట్టుదలతో సాగర్ ఉన్నారు. ఈ సినిమాకు ప‌ద్మ‌శ్రీ దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్ కాశ్యప్ సంగీతం అందిస్తున్నారు.  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు-శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్ కే నాయుడు పాత్ర‌లో సాగర్ న‌టించిన మొగ‌లిరేకులు సీరియ‌ల్ తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సీరియల్ తో సాగర్ కు హీరో ఇమేజ్ వచ్చింది. దీంతోనే ఆయన సినిమాలపై దృష్టి పెట్టారు. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. ఈ క్రమంలోనే ఆయన ’షాదీ ముబార‌క్‌‘పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మార్చి 5న ఈ సినిమా విడుదల కానుంది.