Home రాష్ట్ర వార్తలు టాం కాం

టాం కాం

గల్ఫ్‌లోని కార్మికులకు భరోసా, వెబ్‌సైట్ ఆవిష్కరించిన హోంమంత్రి నాయిని

nainiహైదరాబాద్: ఉద్యో గ, ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకుని  గల్ప్ లాంటి విదేశాలకు వలస వెళ్లిన కార్మికులు నిరుద్యోగులకు  రాష్ట్ర కార్మి క శాఖ బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే వలస వెళ్లిన కార్మికులు ఆయా దేశాల్లో ఏజెంట్ల, మధ్యవర్తల చేతుల్లో ఘోరం గా మోసపోయి అష్టకష్టాలు పడుతున్న వైనాన్ని గమనంలోకి తీసుకున్న ప్రభు త్వం ఇక దిద్డుబాటు చర్యలను తీసు కుంది. ‘టామ్ కామ్’ పేరిట ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సచివాలయంలో గురువారం లాంఛ నంగా ఆవిష్కరించారు.  విదేశాలకు ఉపాధి నిమి త్తం వెళ్లాలనుకునే కార్మికులు, యువకులు జిల్లాల నుండి కూడా తమ పేర్లను ఈ వెబ్‌సైట్‌లో నమో దు చేసుకునేలా ప్రభుత్వం టామ్‌కామ్ వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. ఉపాధి కల్పనకు మరింతగా బాసటగా ఉండాలన్న లక్షంతో ప్రభు త్వం ఈ పోర్టల్‌ను రూపొందించడం విశేషం. దశాబ్దాల పాటు గల్ఫ్‌కు వలస వెళ్తున్న కార్మికు లకు ఏజెంట్ల చేతిల్లో మోస పోయి తీవ్రంగా నష్ట పోతున్న విషయం     తెలిసిందే. వీసా, పాస్ పోర్టులు మొదలు కొని ఏవేవో సాకులు చూపి ఇక్కడి నుండి వలస వెళ్లిన కార్మికుల కు ఆయా దేశాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉపాధి పనులకు అవకాశం లేకుండా చేయడంతో రాష్ట్ర యు వత తీవ్రంగా నష్ట పోయారు. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గల్ప్ దేశానికి వెళ్లి ఆ దేశ రాయ బారితో ప్రత్యేకంగా చర్చలు జరిపింది. ఇకపై మో సాలకు అవకాశం లేకుండా చూస్తామని గల్ప్ విదేశీ రాయబార ప్రతినిధి మన రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హా మీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని , ఆ ప్రొసిజర్ ప్రకా రంగా తమకు కార్మికుల జాబితాను ఇస్తే తాము పక్కాగా ఎలాంటి మోసాలు జరగకుండా తెలంగాణ బిడ్డలకు పూచీకత్తుగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం టామ్ కామ్ వైబ్ సైట్ రూపకల్పనకు చర్యలు తీసుకుంది.
తెలంగాణ బిడ్డలు మోసపోకూడదనే కామ్:మంత్రి నాయిని
ఉద్యోగ, ఉపాధి వెతుక్కూంటే విదేశాలకు వెళ్లిన భార తీయుల సంఖ్య 3 కోట్లపైనే ఉంటుందని, ఇందులో తెలంగాణ బిడ్డలు 10 వేల మంది వరకు ఉంటారని మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. టామ్ కామ్ వెబ్ పోర్టల్‌ను గురువారం ఆయన సచివాలయంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఉపాధి కోసం వెళ్లాల నుకునే వారు ఈ వెబ్ పోర్టల్‌కు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే పంపుకోవచ్చని, అందని దరఖాస్తులకు తాము ఒక యూనిక్ ఐడిని ఇస్తామని ఆయన పేర్కొ న్నారు. తొలి విడతలో టామ్ కామ్ ద్వారా 750 మంది యువకులను గల్ప్‌కు పంపుతున్నామని, ఇప్ప టికే వారికి సమాచారం అందజేశామన్నారు. టామ్ కామ్ ద్వారా వెళ్లిన కార్మికులకు గల్ప్‌లో ఉచిత నివా సం, పని ప్రదేశాలకు ఉచిత రవాణా సదుపాయాల ను ఆయా సంస్థలు కల్పిస్తాయన్నారు. వేతనాలు చె ల్లించకుండా మోసగించే అవకాశమే లేదని మంత్రి నాయిని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తమ బిడ్డలకు ఉపాధి కల్పన పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటు సంస్థలు, నకిలీ మధ్య వర్తల మో సాలకు బలై ఎందరో బిడ్డలు విదేశాల్లో జైళ్లలో మగ్గు తున్నారని మంత్రి నాయిని గుర్తు చేశారు. వీసా, పాస్ పోర్టులు కూడా గుంజుకొని వారిని జైళ్లలోకి అక్కడి అధికారులు తోసేశారని నాయిని గుర్తు చేశారు. గడు వు ముగిసినా ఇంకా పని చేయాలనుకునే కార్మికులు తమతో సంప్రదిస్తే ఎంబసీ అధికారులతో తాము మా ట్లాడి అవసరమైన కాలానికి పూచీకత్తు కోసం ప్రయ త్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హోం సెక్రటరీ రా జీవ్ త్రివేది, టామ్ కామ్ వెబ్‌సైట్ రూపకర్త, హైబిజ్ టివి ఎమ్‌డి రాజగోపాల్ తదతరులు పాల్గొన్నారు.