Thursday, April 25, 2024

టమాట @ 60

- Advertisement -
- Advertisement -

Tomato In open market, price has reached Rs 60

వరుస వర్షాలతో
కొట్టకు పోయిన టమాట పంట
తీవ్రంగా నష్టపోయిన రైతులు

మన తెలంగాణ, హైదరాబాద్ : కొంత కాలం నేల చూపులు చూసిన టమాట ధర ఒక్క సారిగా పెరిగింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వరుస వర్షాల కారణంగా టమాట పంటకు తీవ్ర నష్టం వాటిల్లిడంతో రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. దీంతో పోరుగు రాష్ట్రాల కర్నాటక, మహారాష్ట్ర, ఏపీల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో ట్రాన్స్‌పోర్టు చార్జీల ప్రభావం కూడా పడింది. మూడు నెలల క్రితం కిలో టమాట రూ.10 నుంచి 15 వరకు పలుకగా ప్రస్తుతం ధర రైతు బజార్లలో రూ.40కు చేరగా బహిరంగ మార్కెట్‌లో ధర రూ.60కి చేరింది. రైతు బజార్లలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే చిల్లర వ్యాపారులు వద్ద కిలో టమాట రూ. 65 నుంచి 70 పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం టమాట పంట భూమికి ఒక అడుగు ఎత్తులో కాయడంతో వర్షానికి పంట పూర్తిగా కొట్టుకు పోయిన పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ శాఖ అధికారులు చెబుతున్నారు.

మార్కెట్లలో టమాట కొరత

ప్రస్తుతం జంట నగరాల్లో ఉన్న మెండా మార్కెట్,బోయిపల్లి వంటి హోల్‌సేల్ మార్కెట్లతో పాటు మెహదీపట్నం, కూకట్ పల్లి, ఎర్రగడ్డ ,ఎల్‌బినగర్, వనస్థలిపురం వంటి ప్రధాన రైతు బజార్లలో కూడా టమాట కొరత ఏర్పడింది. సాధారణ రోజుల్లో నగరానికి 80 నుంచి 100 లారీల టమాట దిగుమతి అవుతుంటే ప్రస్తుతం రోజుకు 50 లారీల రావడం కూడా కష్టమైందని మార్కెట్ శాఖ అధికారులు చెబుతున్నారు. హొల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాట రూ.50 నుంచి 55 పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో మాత్రం రూ. 65 నుంచి 70 వరకు వసూలు చేస్తున్నారు. నగరానికి ప్రధానంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, సిద్దపేట, తదితర జిల్లా నుంచే కాకుండా ఏపీ లోని చిత్తూరు నుంచి కూడా టమాట దిగుమతి అవుతుంటుంది.

నగరానికి రోజుకు 45 నుంచి 50 టన్నుల డిమాండ్ ఉండగా ప్రస్తుతం 25 టన్నులు కూడా రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కర్నాటక రాజస్థాన్ నుంచి టమాట దిగుబడి వచ్చేది . ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోనూ టమాట దిగుబడి తక్కువగా ఉండటంతో నగరానికి సరఫరా తగ్గింది. మార్కెట్‌లో టమాట కొరత దృష్టిలో పెట్టుకుని సూపర్ మార్కెట్,మాల్స్, నిర్వాహకుల మాత్రం పెద్ద మొత్తంలో టమాటను రైతుల నుంచి టోకుగా కొనుగోలు చేస్తు కృత్రిమ కొరత సృష్టిసున్నారు.
కూకట్‌పల్లి రైతు బజార్‌లోని కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. (మంగళవారం నాటివి)

టమాట రూ ః 40.00

వంకాయ రూ ః 28.00

బెండకాయ రూ ః 28.00

పచ్చిమిర్చి రూ ః 23.00

కాకరకాయ రూ ః 35.00

క్యాబేజ్ రూ ః 14.00

ఫ్రెంచ్ బీన్స్ రూ ః 45.00

దొండకాయ రూ ః 38.00

క్యాలిఫ్లవర్ రూ ః 35.00

క్యాప్సికమ్ రూ ః 65.00

ఆలుగడ్డలు రూ ః 20.00

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News