Home తాజా వార్తలు రేపు హరికృష్ణ అంత్యక్రియలు

రేపు హరికృష్ణ అంత్యక్రియలు

Tomorrow Harikrishna funerals

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నటుడు, టిడిపి అగ్రనేత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు జానకీరామ్ అంత్యక్రియలు జరిగిన శంషాబాద్ సమీపంలో ఉన్న ఫాంహౌస్‌లోనే హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో హరికృష్ణ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ భవన్‌లో అభిమానుల సందర్శనానర్థం ఉంచుతారు. ఆయన కొడుకులు కల్యాణ్‌రామ్, ఎన్‌టిఆర్‌లు కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి వారు బోరున విలపించారు. ఎపి సిఎం చంద్రబాబునాయుడు, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ, మంత్రి లోకేష్, హరికృష్ణ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు నటుడు జగపతిబాబు, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు కామినేని ఆస్పత్రికి వచ్చారు.
ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం హరికృష్ణ తన అభిమానులకు లేఖ రాశారు. సెప్టెంబరు 2న తన జన్మదినం సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని, కేరళ వరద బాధితులను ఆదుకోవాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ అభిమానులకు అందకముందే హరికృష్ణ చనిపోయారు. ఆయన మృతి సినీరంగానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు.

Tomorrow Harikrishna funerals