Home తాజా వార్తలు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ

రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ

Heavy Rain

 

హైదరాబాద్: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు రేపు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నారాయణపేట 11.6, మేడ్చల్ మల్కాజిగిరిలో 11 సెంటిమీటర్లు, కామారెడ్డి 7.5, హైదరాబాద్ 9, రంగారెడ్డి 5, నిర్మల్ 4.1, నిజామాబాద్ 10.2, సిద్దిపేట 9.3, మహబూబ్‌నగర్ 8.3, జనగాం 8.3, జోగుళాంభ గద్వాల్ 6.6, వరంగల్ రూరల్ 6.3, కరీంనగర్ 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలంగాణలో, కోస్తా, రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నేపథ్యంలో సముద్రం నుంచి భారీగా తేమ గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొమెరిన్ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. వీటి ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు భారీగా వీస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లో శుక్రవారం భారీగా వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి పలు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని ప్రఖ్యాత రంగనాథ స్వామి ఆలయంపై శుక్రవారం ఉదయం పిడుగుపడింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పిడుగు పడడంతో ఒక కోతి, పది పావురాలు మృత్యువాత పడ్డాయి.

Tomorrow Heavy Rain In Telangana