Home జాతీయ వార్తలు లష్కరే తోయిబా అగ్ర నేత అసిఫ్ హతం….

లష్కరే తోయిబా అగ్ర నేత అసిఫ్ హతం….

Terrorists

 

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లోని సోపోర్ జిల్లాలో బుధవారం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా అసిఫ్ కారులో వెళ్తూ కాల్పులు జరపడంతో జవాన్లు అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఘటనాస్థలంలో అసిఫ్ హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఎకె-47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   లష్కరే తోయిబాలో అసిఫ్ అగ్రనేతగా పని చేశారు. రెండు రోజుల క్రితం సోపోరో లో ఓ ఇంట్లో అసిఫ్ చొరబడి కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిను ముగ్గురు గాయపడ్డారు.   తీవ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

 

Top LeT terrorist killed by Indian Army in Jammu
Top LeT terrorist killed by security forces in J&K’s Sopore