Home ఖమ్మం ‘ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రాల ఏర్పాటు ’

‘ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రాల ఏర్పాటు ’

Chandu-Lalవరంగల్: వరంగల్ జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్ పట్నంలోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన సత్రాన్ని ఆయన ప్రారంభిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించేలా అన్ని జిల్లాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి చెప్పారు. పర్యాటకుల సంఖ్య పెరిగే ఆదాయంతోపాటు రాష్ట్రాభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.